మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన సమాచారం కలకలం రేపింది. తనకు న్యాయం జరగడం లేదని, ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె ఈ నిర్ణయానికి పాల్పడినట్లు సమాచారం. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించిన మాధురి రాథోడ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి రాథోడ్ గతంలో పోలీసులకు...