ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష.. నిరంతర బొగ్గు సరఫరాపై దృష్టి
విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష.. నిరంతర బొగ్గు సరఫరాపై దృష్టి హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రజాభవన్‌లో విద్యుత్, ఇంధన శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ఇంధన, ఆర్థిక శాఖలు పరస్పర...