దేశరాజ్‌పల్లిలో నూతన భవనాలకు భూమిపూజ
దేశరాజ్‌పల్లిలో నూతన భవనాలకు భూమిపూజ గ్రామపంచాయతీ, విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణ పనులు ప్రారంభం చొప్పదండి ప్రతినిధి / తెలంగాణ అడ్డా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దేశరాజ్‌పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శ్రీకారం చుట్టారు. నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలు, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం...