హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా తెలంగాణ గంగా తెప్పోత్సవం
హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా తెలంగాణ గంగా తెప్పోత్సవం భక్తిశ్రద్ధలతో గంగా హారతి.. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన వేడుక హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్ తీరంలో తెలంగాణ గంగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు, గంగపుత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగా హారతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. దీంతో హుస్సేన్‌సాగర్ తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గంగా హారతిని ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు స్వీకరించారు. తెలంగాణలోని మత్స్యకారులు, గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ...