యువ సమరభేరి విజేతతో బీజేపీ, కాంగ్రెస్‌లలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్

యువ సమరభేరి విజేతతో బీజేపీ, కాంగ్రెస్‌లలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన విద్యార్థి, యువ సమరభేరి సభ అపూర్వ విజయాన్ని సాధించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో భయం మొదలైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. సభ సక్సెస్ కాలేదంటూ మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడటం బీజేపీ పార్టీ భయానికి నిదర్శనమని స్పష్టం చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. నగరపాలక సంస్థలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా,...