జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ సస్పెన్షన్
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ సస్పెన్షన్ డ్యూటీల కేటాయింపులో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలపై వేటు జగిత్యాల ప్రతినిధి / తెలంగాణ అడ్డా జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ (RI) అడ్మిన్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. విధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సిబ్బందికి డ్యూటీలు కేటాయించే విషయంలో కిరణ్ కుమార్ వ్యవహారశైలిపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు కేటాయించకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు...