నిమ్మపెల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
కాంగ్రెస్ హామీలపై ‘బాకీ కార్డులు’ పంపిణీ నిమ్మపెల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కోనరావుపేట, తెలంగాణ అడ్డా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారెంటీ కార్డులకు బదులుగా ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రజలకు ఈ కార్డులను అందజేశారు. రైతులకు రూ.500 బోనస్, మహిళలకు పింఛన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, కళ్యాణలక్ష్మి–షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం, ఉపాధి కూలీలకు రూ.12 వేల ఆర్థిక...