మెట్రో–ఆర్టీసీ సంయుక్త పాస్ తక్షణమే అమలు చేయాలి

మెట్రో–ఆర్టీసీ సంయుక్త పాస్ తక్షణమే అమలు చేయాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఆదేశం హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం మెట్రో–ఆర్టీసీ సంయుక్త (జాయింట్) పాస్‌ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు అధికారులను ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్, టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు మొదటి, రెండో...