ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్‌లో కుప్పకూలిన భారీ భవనం
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్‌లో కుప్పకూలిన భారీ భవనం ఢిల్లీ ప్రతినిధి / తెలంగాణ అడ్డా దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ భవనం కుప్పకూలి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని ఈ భవనాన్ని విద్యార్థుల పీజీ వసతి గృహంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. భవనం కూలిన వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తూ, లోపల చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, ఆరుగురిని...