ప్రజాభవన్‌లో ఈహెచ్‌ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట ప్రజాభవన్‌లో ఈహెచ్‌ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈహెచ్‌ఎస్ పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉద్యోగులు, వారి...