ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజం

ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజం నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రభుత్వం–ప్రజలకు బలమైన వారధిగా పనిచేయాలి వరంగల్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజమని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం1 టీవీ ఛానల్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ.. సమాజంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నిజాయితీ, నిష్పక్షపాతంతో కూడిన వార్తలను అందిస్తూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వం–ప్రజల...