మాధవాని కుంటను కాపాడాలి: జీహెచ్‌ఎంసీ డీసీకి బీజేపీ నేత వినతి

మాధవాని కుంటను కాపాడాలి: జీహెచ్‌ఎంసీ డీసీకి బీజేపీ నేత వినతి బొల్లారం, తెలంగాణ అడ్డా: బొల్లారం జీహెచ్‌ఎంసీ 272వ డివిజన్‌ పరిధిలోని మాధవాని కుంటలోకి డ్రైనేజీ, మురుగు నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ బొల్లారం పట్టణ అధ్యక్షుడు కెజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఆయన డీసీని కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో బొల్లారం ప్రజలకు తాగునీటి వనరుగా ఉపయోగపడిన మాధవాని కుంట ప్రస్తుతం మురుగు నీరు కలవడంతో తీవ్రంగా కలుషితమవుతోందని ఆనంద్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుంటకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే...