ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన అబ్దుల్ జమీల్
జగిత్యాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన అబ్దుల్ జమీల్ జగిత్యాల బ్యూరో / తెలంగాణ అడ్డా: జగిత్యాల జిల్లా కేంద్రంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యా రంగంలో విశేష సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఆర్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు, జెడ్పీహెచ్‌ఎస్ నూకపల్లి స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) అబ్దుల్ జమీల్.. జగిత్యాల శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు....