గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ భారీ నిరసన.. అసెంబ్లీలో టీషర్ట్ల వివాదంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ భారీ నిరసన.. అసెంబ్లీలో టీషర్ట్ల వివాదంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నల్ల టీషర్ట్లు ధరించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1000 రోజులు గడిచినా ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిరసనలో భాగంగా అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ఎస్ సభ్యులను...