ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ప్రజా సమస్యలపై గళమెత్తి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, సీనియర్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు తీవ్ర దురుసుగా వ్యవహరించారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధి అని కూడా...