ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో విద్యార్థుల భారీ ర్యాలీ కల్వకుంట్ల కవిత నిప్పులు

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో విద్యార్థుల భారీ ర్యాలీ.. కల్వకుంట్ల కవిత నిప్పులు హన్మకొండ బ్యూరో / తెలంగాణ అడ్డా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని...