స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ / తెలంగాణ అడ్డా శాసనమండలి సభ్యుడు తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోని సభాపతి ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను నేరుగా కలిశారు. తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, స్పీకర్‌ను పరామర్శించి తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. స్పీకర్‌పై...