సుడా చైర్మన్ తీరుపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. పదవుల లాలసపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు

సుడా చైర్మన్ తీరుపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. పదవుల లాలసపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ​కరీంనగర్ బ్యూరో/ తెలంగాణ అడ్డా ​కరీంనగర్ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. సుడా (SUDA) చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి వ్యవహారశైలి, పార్టీలోని ఇతర సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ప్రచారంపై సొంత పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. పదవుల కోసం పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు కేవలం గుసగుసలుగా కాకుండా బహిరంగ విమర్శలకు తావిస్తున్నాయి. ​గతంలో నగర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో "నేను లేకుంటే పార్టీ లేదు" అన్నట్లుగా వ్యవహరించడం, కేవలం పదవుల అనుభవమే లక్ష్యంగా రాజకీయాలు సాగిస్తున్నారనే విమర్శలు బలంగా...