ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు విత్తన గణపతి అందజేత

ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు విత్తన గణపతి అందజేత కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన విత్తన గణపతిని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు అందజేశారు. కరీంనగర్‌లోని శ్రీపురం కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్, మధు తదితరులు విత్తన గణపతిని కొప్పుల ఈశ్వర్‌కు అందజేశారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణహిత వినాయక చవితి వేడుకలను నిర్వహించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతిని పూజించడం...