గంగాధరలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ విజయ్‌కుమార్

గంగాధర ప్రతినిధి / తెలంగాణ అడ్డా తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్‌జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ విజయ్‌కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కొండ శశికాంత్ (24) ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. గతంలో చిట్‌ఫండ్ ఏజెంట్‌గా, రేకుర్తిలోని హీరో షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేసిన ఇతను.. మద్యపానం, గంజాయి వంటి దురలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ...