ఎమ్మెల్యేల అరెస్ట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్.. కరీంనగర్‌లో భారీ రాస్తారోకో
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా సబ్బండ వర్గాలను మోసం చేసిందని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. కరీంనగర్ బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు....