ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత.. ఇప్పట్లో ఆ ప్రక్రియ లేనట్లే!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం ఇప్పట్లో కార్యరూపంలోకి రాలేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు జరిపినపుడు గుర్తింపు పొందిన కార్మిక సంఘం కోసం ఎన్నికలు నిర్వహించడం, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి 11 శాతం ఫిట్‌మెంట్ ఇవన్నీ నిర్ణయించినట్లు గుర్తు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనంతో అనేక సమస్యలు వచ్చాయని, అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎన్నికల నిర్వహణ కోసం కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. జేఏసీతో జరిగిన చర్చల అంశాలపై...