ఎస్ఐఆర్ గడువు పొడిగింపు.. అక్టోబర్ 7 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం అక్టోబర్ 7 వరకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.