మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు దక్కిన గౌరవం: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో శ్రీమతి గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ప్రజాభవన్‌కు విచ్చేసిన గద్వాల విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తొలి ఫైల్‌పై విజయలక్ష్మి సంతకం చేశారు. ఆ తర్వాత సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించి, అక్కడ ప్రజావాణి అమలవుతున్న తీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్...