మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు: బీఆర్‌ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్
నల్ల దుస్తులతో అసెంబ్లీకి రావడం నేరమా? మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు: బీఆర్‌ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా పటాన్‌చెరు, తెలంగాణ అడ్డా: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ మహిళా...