11 మంది అధికారులు హాజరు.. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ

వీర్నపల్లిలో ప్రజావాణి.. 9 అర్జీల స్వీకరణ 11 మంది అధికారులు హాజరు.. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ వీర్నపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల స్థాయిలో వికేంద్రీకరించడంలో భాగంగా వీర్నపల్లి మండల ప్రజాపరిషత్ (MPP) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన 11 మంది అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలను స్వీకరించారు....