కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

అక్రమ అరెస్టులతో బీజేపీ గొంతు నొక్కలేరు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 7: అక్రమ అరెస్టులతో బీజేపీ గొంతును నొక్కలేరని వర్ధన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నేపథ్యంలో అడప రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అడప రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అడప...