వేములవాడలో పోటెత్తిన భక్తులు.. శ్రావణ చివరి సోమవారం సందడి

వేములవాడలో పోటెత్తిన భక్తులు.. శ్రావణ చివరి సోమవారం సందడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంలో ఉత్సవ మూర్తుల దర్శనం వేములవాడ, సెప్టెంబర్ 7, తెలంగాణ అడ్డా ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంలో స్వామివారి ఉత్సవ మూర్తులను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకుని...