అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత - హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్ వేసింది. సోమవారం వెలువడిన ఆ ఉత్తర్వులను సవరించాలంటూ కోర్టును కోరింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారని, ప్లకార్డులు, వ్యతిరేక రాతలతో ఉన్న టీషర్టులు ధరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని ధర్మాసనానికి విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు వారిని అడ్డుకున్నారని వివరించారు. శాసనసభ్యుల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని ఏజీ తెలిపారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను దూషించారని, వారిని నెట్టివేసి బూతులు తిట్టారని వాదించారు. బీఆర్ఎస్...