రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం దుర్మార్గం ప్రజా సమస్యలను గాలికొదిలేసి సభా సమయం వృథా చేస్తున్నాయి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప, చావు కోరుకోవడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదని, అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. అంటే ఆయన దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటని, ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను...