కరీంనగర్‌లో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు పకడ్బందీ ఏర్పాట్లకు అధికారుల ఆదేశం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్‌లో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన పీస్‌ కమిటీ సమావేశంలో పోలీస్‌ కమిషనర్ గౌష్‌ ఆలమ్‌తో కలిసి కలెక్టర్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఏడాది జిల్లాలో గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని, అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. వినాయక చవితి...