ఉత్తమ ఉపాధ్యాయుడు కనకయ్యకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడు కనకయ్యకు ఘన సన్మానం బోయినపల్లి మండల కేంద్రంలో అభినందన కార్యక్రమం బోయినపల్లి, సెప్టెంబర్ 8 (తెలంగాణ అడ్డా): బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కనకయ్య ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి కనకయ్య చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి సత్కరించడం ఇతర ఉపాధ్యాయులకు కూడా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి విద్యార్థుల విద్యాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కనకయ్య...