సోషల్ మీడియాలో హద్దులు మీరిన పోలీస్ యూనిఫామ్‌ను అడ్డం పెట్టుకుని మహిళలను కించపరచడంపై సర్వత్రా ఆగ్రహం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ​వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యక్తులు షార్ట్ ఫిల్మ్స్ పేరుతో హద్దులు మీరుతున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పోలీస్ యూనిఫామ్ వేసుకొని, ఒక మహిళను అవమానించేలా తీసిన ఒక వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, అది నిజమైన పోలీసులే చేశారేమో అన్నట్టు చాలామంది ఆ వీడియోను వైరల్ చేస్తూ పోలీసులపై నిందలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ​ఈ నేపథ్యంలో పలువురు బాధ్యతాయుతమైన పౌరులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు కీలక విజ్ఞప్తులు చేస్తున్నారు. పోలీస్ యూనిఫాం అనేది మన సమాజ రక్షణకు, క్రమశిక్షణకు ప్రతీక అని, కేవలం వినోదం లేదా...