కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి

కాళోజీ జీవితం ఆదర్శప్రాయం కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత ములుగు, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – ములుగు ప్రతినిధి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు. కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని సన్‌రైజర్స్ హైస్కూల్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమలత కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల...