కాంగ్రెస్–బీఆర్ఎస్ దొంగనాటకాల వల్లే ప్రజా సమస్యలు గాలికొదిలేశారు: జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్
కాంగ్రెస్–బీఆర్ఎస్ దొంగనాటకాల వల్లే ప్రజా సమస్యలు గాలికొదిలేశారు: జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్ కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కాంగ్రెస్–బీఆర్ఎస్ రాజకీయ దొంగనాటకాలకు ప్రజల సమస్యలు బలవుతున్నాయని జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేరమా అని, కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అని డా. బండారి రాజ్ కుమార్ ప్రశ్నించారు. అరెస్టులతో జనసేన గొంతును నొక్కలేరని, ప్రజల కోసం తమ పోరాటం మరింత ఉధృతమవుతుందని స్పష్టం...