దళితబంధు లబ్ధిదారుల అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
దళితబంధు లబ్ధిదారుల అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: దళిత బంధు నిధుల విషయంలో దళితులను మోసం చేసి వారికి నిధులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కొత్త డ్రామాకి తెరలేపుతూ, దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్ లో ఉన్న 50 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు ఆడటంలో కౌశిక్ రెడ్డిని మించిన...