ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీలు కోదండరామ్, శ్రీపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీలు కోదండరామ్, శ్రీపాల్ రెడ్డి హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు, ప్రజా సంక్షేమం మరియు ప్రజా ప్రయోజనకరమైన పలు అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో వివరంగా చర్చించడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.