ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్మిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది విద్యార్థులకు షీ టీమ్ విధులు, లక్ష్యాలు, మహిళలు మరియు బాలికల భద్రత కోసం అందిస్తున్న సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరంగా వివరించారు. సైబర్ నేరగాళ్ల...