ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్
ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్ హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలోని వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాలకు ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యువల్ కోసం ఇన్‌స్పెక్షన్ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన ఆ అధికారి, ఇప్పటికే విడతల వారీగా రూ.30 వేలు లంచంగా తీసుకున్నాడు. బుధవారం తన కార్యాలయంలో మరో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన...