చైన్ స్నాచింగ్‌లు, బైక్ దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడు అరెస్ట్
చైన్ స్నాచింగ్‌లు, బైక్ దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడు అరెస్ట్ పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా: పెద్దపల్లి పట్టణంలో వరుసగా చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవారియా తెగకు చెందిన నిందితుడు కలిరామ్ (38)ను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు కపిల్ పరారీలో ఉన్నాడు. నిందితులు ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో వివిధ ప్రాంతాలకు వచ్చి, ముందుగా ఇళ్ల బయట లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారు. ఆ బైక్‌లపై తిరుగుతూ రోడ్లపై ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు పుస్తెలతాళ్లు,...