ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షా శిబిరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షా శిబిరాలు రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ తెలంగాణ అడ్డా: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమగ్ర నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 15 నుంచి ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంపై వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలతో ఆమె అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ “నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్” అనే లక్ష్యంతో జిల్లాలోని ఏ ప్రభుత్వ...