బొల్లారం 272 డివిజన్ ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం

బొల్లారం 272 డివిజన్ ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం పేద ప్రజల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి: కె.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి బొల్లారం, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – జిన్నారం ప్రతినిధి): బొల్లారం 272 డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి జి. శ్రీజన, ఐఏఎస్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బొల్లారం ప్రాంతంలోని పేద ప్రజలు, కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు వారి...