గణేష్ ఉత్సవాల ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.. అధికారులకు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ దిశానిర్దేశం
గణేష్ ఉత్సవాల ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.. అధికారులకు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ దిశానిర్దేశం హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వచ్చే గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీలు, డీసీపీలు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన...