పత్తి పంట సమగ్ర సస్యరక్షణ సాంకేతికతపై రైతులకు అవగాహన
పత్తి పంట సమగ్ర సస్యరక్షణ సాంకేతికతపై రైతులకు అవగాహన తెలంగాణ అడ్డా న్యూస్, (భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు మండలం అన్నారం గ్రామం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "ఆత్మ" కార్యక్రమం ద్వారా రైతు కముజు చంద్ర మోహన్ పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ (ఐ పి ఎం) సాంకేతికతపై ప్రదర్శన ( డెమో) నిర్వహించినట్లు మణుగూరు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి డాక్టర్ కొమరం లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పత్తి పంటలో చీడపీడల నియంత్రణకు రసాయనిక పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, ఫెరోమోన్ ట్రాప్స్, స్టిక్కీ ట్రాప్స్, స్టెమ్ అప్లికేషన్, వేపనూనె తదితర ఐ...