కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, పౌరుల స్పందన (సిటిజన్ ఫీడ్‌బ్యాక్) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిశీలించిన సీపీ, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), ఈ-సాక్ష్య, సమన్వయ వంటి సాంకేతిక పోర్టల్స్, అప్లికేషన్ల పనితీరును సమీక్షించారు. నేర పరిశోధన, రోజువారీ పోలీసింగ్‌లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, పోలీస్...