కానిస్టేబుల్, సమాన హోదా పోస్టుల వయోపరిమితి మరో 3 సంవత్సరాలు పెంపు జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్ మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని కానిస్టేబుల్ మరియు తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్-ఎ) శాఖ ఈ మేరకు జీ.ఓ.ఎంఎస్.నెం.129ని సెప్టెంబర్ 9, 2026 న విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏడు (7) సంవత్సరాలు పెంచిన వయోపరిమితికి అదనంగా, ప్రస్తుతం మరో మూడు (3) సంవత్సరాలు పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)...