శాతరాజుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు
శాతరాజుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు శాతరాజుపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): శాతరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా గురువారం ఇంటి వద్ద ముగ్గు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తంపుల అంజయ్య, అవధూత తిరుపతి, గుడిసె లక్ష్మీరాజం, సాహెబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.