లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సెక్రటేరియేట్ ఉద్యోగి, టీఎస్‌ఐడీసీ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ​ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) వైద్య ఖర్చుల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సచివాలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆనందెషి రాఘవేందర్ (ఏవో-1), పరిష్రమ భవన్‌లోని టీఎస్‌ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ (ఏవో-2)లను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెప్టెంబర్ 10, 2026 న ఈ దాడి జరిగినట్లు ఏసీబీ పీఆర్ఓ ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. ​ఫిర్యాదుదారునికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.2,00,000 చెక్కును జారీ చేయడానికి, మిగిలిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి నిందితులు లంచం డిమాండ్ చేశారు. అంతకుముందు ఏవో-2 ఫోన్‌పే ద్వారా రూ.5,000 లంచాన్ని స్వీకరించగా, తాజాగా...