పార్క్ ప్రారంభ సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చాలి
పార్క్ ప్రారంభ సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చాలి వేములవాడ, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): వేములవాడ మున్సిపల్ పరిధిలోని పార్కును సాయంత్రం 5 గంటలకు కాకుండా 4 గంటలకే తెరవాలని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం పార్కు ప్రారంభ సమయం ఆలస్యంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు మరియు సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే పార్కును అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని పట్టణవాసులు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాల నుంచి త్వరగా వచ్చే వారికి పార్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కు ప్రారంభ...