ఎర్రవెల్లి ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆగ్రహం.. బోయినిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదు ఎర్రవెల్లి ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆగ్రహం.. బోయినిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు బోయినిపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం దళితులు నడిచిన రహదారులను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పసుపు నీటితో కడిగి “శుద్ధీకరణ” చేశారనే విషయం సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ చర్య కుల వివక్షను ప్రతిబింబించడమే కాకుండా దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని...